మా బోధనా విధానం

ప్రతి పిల్లవాడు నేర్చుకోగలడని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా నేర్చుకుంటారని మేము నమ్ముతాం. మా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని అర్థం చేసుకుని, వ్యక్తిగత శ్రద్ధతో, అంచెలంచెలుగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తారు. అందుకే పిల్లలు మార్కుల కోసం మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో నేర్చుకుంటారు.

బలమైన పునాదికే మా మొదటి ప్రాధాన్యం. చిన్న తరగతుల నుంచే చదవడం, రాయడం, మాట్లాడడం, గణిత నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్టులకు ఇవే ఆధారం.

నేర్చుకోవడం పుస్తకాలకే పరిమితం కాదు. కార్యక్రమాలు, సైన్స్ పనులు, శనివారం బాలసభ, పాఠశాలలో రోజువారీ జీవితం ద్వారా పిల్లలు మాట్లాడే నైపుణ్యం, క్రమశిక్షణ, బాధ్యత, మంచి విలువలు అలవరచుకుంటారు.

వీటిపై ప్రత్యేక శ్రద్ధ

  • చదవడం అర్థం చేసుకుంటూ ప్రతిరోజూ చదవడం.
  • రాయడం తొలి అక్షరాల నుంచే స్పష్టంగా, అందంగా రాయడం.
  • మాట్లాడడం తరగతిలో, బాలసభలో ధైర్యంగా మాట్లాడడం.
  • గణిత నైపుణ్యాలు అంకెలపై పట్టు, సమస్యలు సాధించే నేర్పు.
వాట్సాప్ చేయండి Developed by HMGenX